Mathematics Methodology - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper II Mathematics Methodology 32 questions 32 marks 30 min English and Telugu (తెలుగు)

Mathematics Methodology - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2 is a subject test in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 32 multiple-choice questions for 32 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics Methodology - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics Methodology - DSC School Assistant - Mathematics TELUGU 2nd Aug 2024 Shift 2. The full paper has 32 questions with detailed explanations after you sign in.

Q1. Identify the correct statement/s from the following with respect to the application of Logic in Mathematics
కింది వాటిలో గణితంలో తర్కం యొక్క అనువర్తనానికి సంబంధించి సరైన వ్యాఖ్య/లను గుర్తించండి.
A) Importance is given only to know whether the conclusion drawn by logic is true or not
కేవలం తర్కం ద్వారా వచ్చే ముగింపు నిజమా కాదా తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
B) Equal importance is given to know whether the conclusion drawn by logic is true or not and also the process involved to arrive the conclusion
తర్కం ద్వారా వచ్చే ముగింపు నిజమో కాదో తెలుసుకోవడానికి మరియు ముగింపును రాబట్టడానికి అవలంబించిన ప్రక్రియకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
C) More importance is given to the process involved to arrive at the conclusion rather than to say whether the conclusion drawn by logic is right or not.
తర్కం ద్వారా వచ్చే ముగింపు సరైనదా కాదా అని చెప్పడం కంటే ముగింపుకు చేరుకునే ప్రక్రియకు మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A only A మాత్రమే
  2. B only B మాత్రమే
  3. C only C మాత్రమే (correct answer)
  4. A & B only A & B మాత్రమే
Answer: C — In mathematical logic, greater importance is attached to the validity of the deductive process involved in reaching a conclusion rather than solely whether the conclusion itself is factually true.
గణిత తర్కంలో, ముగింపు యొక్క యథార్థత కంటే ముగింపుకు చేరుకోవడానికి అవలంబించిన నిగమన ప్రక్రియ మరియు తార్కిక నిరూపణల ప్రామాణికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Q2. The ancient Civilization, which is considered the pioneers in developing field Geometry (Mensuration) is
ప్రాచీన నాగరికతకు సంబంధించి క్షేత్రగణితాన్ని (మెన్సురేషన్) అభివృద్ధి చేయడంలో మార్గదర్శకులుగా పరిగణించబడుతున్న దేశం
  1. India భారతదేశం
  2. Rome రోమ్
  3. Arab అరబ్
  4. Egypt ఈజిప్ట్ (correct answer)
Answer: D — Ancient Egypt is considered the pioneer civilization in developing field geometry (mensuration) due to the necessity of surveying land boundaries after the Nile floods.
నైలు నది వరదల వల్ల చెరిగిపోయిన వ్యవసాయ భూముల సరిహద్దులను తిరిగి కొలవడానికి క్షేత్రగణితాన్ని (మెన్సురేషన్) అభివృద్ధి చేసిన ప్రాచీన ఈజిప్ట్ దేశం క్షేత్రగణిత మార్గదర్శిగా పరిగణించబడుతుంది.
Q3. The First Mathematician who propounded the undefined terms, propositions, axioms and theorems and developed the Geometry by promoting logic is
అనిర్వచిత పదాలు, ప్రతిపాదనలు, స్వీకృతాలు మరియు సిద్ధాంతాలను రూపొందించి జ్యామితి నిర్మాణములో తర్కానికి పెద్దపీట వేసిన తొలి గణిత శాస్త్రజ్ఞుడు.
  1. Euclid యూక్లిడ్ (correct answer)
  2. Bhaskara Charya భాస్కరా చార్య
  3. Archimedes ఆర్కిమెడిస్
  4. Aryabhatta ఆర్యభట్ట
Answer: A — Euclid was the first mathematician to build geometry as a systematic deductive science using undefined terms, definitions, axioms, postulates, and theorems in his work 'The Elements'.
యూక్లిడ్ తన 'ది ఎలిమెంట్స్' గ్రంథంలో అనిర్వచిత పదాలు, నిర్వచనాలు, స్వీకృతాలు మరియు సిద్ధాంతాల ద్వారా నిగమన తర్కంతో జ్యామితిని ఒక శాస్త్రీయ వ్యవస్థగా నిర్మించిన తొలి గణిత శాస్త్రవేత్త.
Q4. Based on the concept of area of triangle, if a learner tries to derive the formula of area of a quadrilateral and a trapezium, then this act falls under this following Academic Standard of Mathematics.
త్రిభుజ వైశాల్యం భావన ఆధారంగా, ఒక అభ్యాసకుడు చతుర్భుజం మరియు ట్రేపీజియం వైశాల్యాల సూత్రాలను ఉత్పాదన చేయడానికి ప్రయత్నిస్తే, అది ఈ క్రింది గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తుంది.
  1. Concept formation భావనల అవగాహన
  2. Problem Solving సమస్య పరిష్కారం
  3. Reasoning and proof కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం
  4. Connection అనుసంధానం చేయడం (correct answer)
Answer: D — Deriving the formula for the area of a quadrilateral and trapezium by connecting it to the concept of the area of a triangle falls under the Academic Standard of 'Connection'.
త్రిభుజ వైశాల్యం భావనను ఉపయోగించి చతుర్భుజం మరియు ట్రెపీజియం వైశాల్య సూత్రాలను ఉత్పాదించడం గణితంలోని 'అనుసంధానం చేయడం' (Connection) అనే విద్యా ప్రమాణానికి చెందుతుంది.
Q5. The process of Judging and taking decisions based on the data gathered by employing different tools on Students learning achievement is
వివిధ సాధనాలను ఉపయోగిస్తూ సేకరించిన దత్తాంశం ఆధారంగా విద్యార్థుల అభ్యసన సాధనపై ఒక అభిప్రాయానికి రావడం మరియు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ
  1. Measurement మాపనం
  2. Evaluation మూల్యాంకనం (correct answer)
  3. Assessment మదింపు
  4. Examination పరీక్ష
Answer: B — Evaluation is the qualitative and quantitative process of making value judgments and educational decisions based on assessment data gathered through various tools.
వివిధ సాధనాల ద్వారా సేకరించిన దత్తాంశం ఆధారంగా విద్యార్థుల అభ్యసన సాధనపై గుణాత్మక తీర్పు చెప్పడం మరియు తగిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను 'మూల్యాంకనం' (Evaluation) అంటారు.

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.