Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Mathematics Methodology 6 questions 6 marks 6 min English and Telugu (తెలుగు)

Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2. The full paper has 6 questions with detailed explanations after you sign in.

Q1. Read the following pairs related to validation processes in proving

mathematical statements.

గణిత ప్రవచనాల నిరూపణలో ప్రామాణీకరణ ప్రక్రియలకు సంబంధించిన క్రింది జతలను చదవండి.

A) Using that “2 is an even prime number” as a counterexample to disprove
that “all prime numbers are odd”: Informal Proof
“ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు” అనే దానిని ఖండించడానికి “2 సరి ప్రధాన సంఖ్య” అనే
ప్రత్యుదాహరణ నివ్వడం: అనియత నిరూపణ

B) A student who knows that “there are infinitely many numbers between
0 and 1” hypothesises that “there are also infinitely many numbers
between 1 and 2”: Intuitive Proof
“0, 1ల మధ్య అనంతమైన సంఖ్యలుంటాయి” అని తెలిసిన విద్యార్థి, “1, 2ల మధ్య కూడా
అనంతమైన సంఖ్యలుంటాయి” అని పరికల్పన చేయడం: అంతర్బుద్ధి నిరూపణ

C) By observing the figure related to the proof of Pythagoras theorem,
student states that “a² + b² = c²”: Formal Proof
విద్యార్థి, పైథాగరస్ సిద్ధాంత నిరూపణకు సంబంధించిన పటాన్ని పరిశీలించి “a² + b² = c²”
అని చెప్పును: నియత నిరూపణ

Choose the correct pair/s:

సరైన జత/లను ఎంచుకోండి:
  1. A & B only A & B మాత్రమే (correct answer)
  2. B & C only B & C మాత్రమే
  3. A & C only A & C మాత్రమే
  4. A, B & C
Answer: A — In mathematics pedagogy, validation processes include intuitive proof, informal proof, and formal proof. Intuitive proof relies on immediate insight or perception; informal proof uses counterexamples, inductive patterns, or visual models; formal proof strictly uses deductive logic, axioms, and defined theorems.
గణిత ప్రవచనాల నిరూపణలో ప్రామాణీకరణ పద్ధతులు మూడు రకాలు: అంతర్బుద్ధి నిరూపణ (Intuitive proof), అనియత నిరూపణ (Informal proof), మరియు నియత నిరూపణ (Formal proof). ప్రత్యుదాహరణల ద్వారా నిరూపించడం అనియత నిరూపణ కాగా, అంతర్దృష్టితో గ్రహించడం అంతర్బుద్ధి నిరూపణ.
Q2. A student “can tell difference between rational numbers and fractions”. Then,
the academic standard attained by the student is:

ఒక విద్యార్థి/ని “అకరణీయ సంఖ్యలు, భిన్నాల మధ్య గల భేదాలను చెప్పగలడు/దు”. అయిన, ఆ
విద్యార్థి/ని సాధించిన విద్యా ప్రమాణము:
  1. Problem solving సమస్యా సాధన
  2. Connection అనుసంధానం
  3. Communication వ్యక్తపరచడం
  4. Reasoning and proof కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం (correct answer)
Answer: D — According to the SCERT mathematics curriculum framework, learning outcomes are categorized under five academic standards. Distinguishing between mathematical concepts, stating differences, classifying, and justifying characteristics belong to the academic standard of 'Reasoning and Proof'.
గణిత విద్యాప్రమాణాలలో భావనల మధ్య భేదాలను గుర్తించడం, పోల్చడం, వర్గీకరించడం, కారణాలు వివరించడం మరియు ఫలితాలను సమర్థించడం వంటి అభ్యసన సూచికలు 'కారణాలు చెప్పడం – నిరూపణలు చేయడం' (Reasoning and Proof) అనే విద్యాప్రమాణం క్రిందికి వస్తాయి.
Q3. Identify the most suitable situations in which the inductive method is used
among the following.
క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఉపయోగించడానికి మిక్కిలి అనువైన సందర్భాలను గుర్తించండి
A) Deriving formulae
సూత్రాలను ఉత్పాదించడం
B) Making rules
నియమాలు రూపొందించడం
C) When there is significance to use the formula in problem solving
సమస్య సాధనలో సూత్రాన్ని ఉపయోగించడానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు
D) When there is no significance for how a formula or rule is derived
సూత్రం లేదా నియమం ఏ విధంగా ఉత్పన్నమయ్యిందనే దానికి ప్రాధాన్యత లేనపుడు
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A&Bonly కీ & క మాత్రమే (correct answer)
  2. C& Donly C & D మాత్రమే
  3. A,C& Donly A, C & D మాత్రమే
  4. A.B,C&D
Answer: A — The Inductive Method in mathematics proceeds from the particular to the general, concrete to abstract, and examples to rules. It is specifically suited for discovering mathematical patterns, formulating new rules, and deriving general formulas.
గణిత బోధనలో ఆగమన పద్ధతి (Inductive Method) నిర్దిష్ట ఉదాహరణల నుండి సాధారణ సూత్రాలకు, మూర్త విషయాల నుండి అమూర్త భావనలకు దారితీస్తుంది. ఇది కొత్త సూత్రాలను ఉత్పాదించడానికి మరియు సాధారణ నియమాలను రూపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి.
Q4. Read the following statements related with learning resources in teaching

mathematics.

గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి.

Statement-I : Mathematics library is useful for studying the topic taught in
the classroom as many times as possible and to do revision.

వ్యాఖ్య-I : తరగతి గదిలో చెప్పిన అంశాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని, దానిని పునఃశ్చరణ
చేసుకోవడానికి గణిత గ్రంథాలయం ఉపయోగపడుతుంది.

Statement-II : Teaching some topics is very difficult, if there is no
mathematics laboratory in school.

వ్యాఖ్య-II : పాఠశాలలో గణిత ప్రయోగశాల లేకపోతే, కొన్ని అంశాలను బోధించడం చాలా
కష్టం.

Choose the correct answer:

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. Both the statements are false. రెండు వ్యాఖ్యలు అసత్యం.
  2. Both the statements are true. రెండు వ్యాఖ్యలు సత్యం. (correct answer)
  3. Statement-I is true and Statement-II is false. వ్యాఖ్య-I సత్యం మరియు వ్యాఖ్య-II అసత్యం.
  4. Statement-I is false and Statement-II is true. వ్యాఖ్య-I అసత్యం మరియు వ్యాఖ్య-II సత్యం.
Answer: B — Learning resources such as mathematics libraries and mathematics laboratories play complementary roles in mathematics education. Libraries support independent study, depth, and revision, while laboratories provide hands-on tactile models necessary to grasp abstract spatial and geometrical concepts.
గణిత బోధనలో గ్రంథాలయం మరియు ప్రయోగశాల రెండు అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యసన వనరులు. గ్రంథాలయం విద్యార్థులకు స్వయం అభ్యసనానికి, పునశ్చరణకు తోడ్పడగా; ప్రయోగశాల అమూర్త గణిత భావనలను మూర్తీభవించి సులభంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
Q5. “Model Problem Solving” which is a step in the period plan prescribed by the
State Council of Educational Research and Training, the teacher does:

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సూచించిన పీరియడ్ పథకంలోని ఒక సోపానం అయిన “మాదిరి
సమస్య సాధన” లో ఉపాధ్యాయుడు చేయునది:
  1. The teacher himself solves another problem similar to the problem solved on the blackboard. నల్లబల్లపై సాధింపజేసిన సమస్య లాంటిదే మరొక సమస్యను ఉపాధ్యాయుడే స్వయంగా సాధిస్తాడు.
  2. Asks the children to look at and copy a solved model problem in the textbook. పాఠ్యపుస్తకంలో సాధించబడిన మాదిరి సమస్యను చూసి కాపీ చేయమని పిల్లలకు చెబుతాడు.
  3. Gives a model problem as homework and asks the children to solve it and come. ఒక మాదిరి సమస్యను ఇంటి పనిగా ఇచ్చి, దానిని సాధించుకొని రమ్మని పిల్లలకు చెబుతాడు.
  4. Writes another problem similar to the problem solved on the blackboard and makes the children to solve it individually in their notebooks. నల్లబల్లపై సాధింపజేసిన సమస్య లాంటిదే మరొక సమస్యను రాసి పిల్లలతో వారి నోటు పుస్తకాలలో వ్యక్తిగతంగా సాధింపజేస్తాడు. (correct answer)
Answer: D — In the SCERT constructivist period plan for mathematics, 'Model Problem Solving' is the transition step between teacher-guided demonstration and independent student practice, where students apply the newly learned concept individually under teacher supervision.
SCERT రూపొందించిన గణిత పీరియడ్ పథకంలో 'మాదిరి సమస్య సాధన' (Model Problem Solving) అనేది ఒక కీలకమైన సోపానం. నల్లబల్లపై వివరించిన సమస్య నమూనా ఆధారంగా పిల్లలు స్వయంగా సమస్యలను సాధించే సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఇది ఉద్దేశించబడింది.

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.